కంది ఐఐటీ హైదరాబాద్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ సుష్మీ బాధులికా ప్రతిష్టాత్మక 'ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ యంగ్ అసోసియేట్ 2026’గా ఎంపికయ్యారు. పరిశోధనల రంగంలో ఆమె కనబరిచిన ప్రతిభకు ఈ గుర్తింపు లభించింది. ఐఐటీహెచ్లో అత్యధిక సైటేషన్లు సాధించిన మహిళా ఫ్యాకల్టీగా, ఎక్కువ పేటెంట్లు పొందిన ప్రొఫెసర్గా ఆమె రికార్డు సృష్టించారు. అకాడమీ ఆమెను అభినందించింది.