కందిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం 14, 15 సంవత్సరాల బాలికలకు హెచ్‌పివి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని సర్పంచ్ చిన్న సాయి శ్రీరామ్ ప్రారంభించారు. ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని ఆయన తెలిపారు. క్యాన్సర్ నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని ఆయన పేర్కొన్నారు.