కంది: ఏర్ధనూర్ గ్రామంలో రైతుల వద్దకే శాస్త్రవేత్తలు

కంది మండలం ఏర్ధనూర్ గ్రామంలో గురువారం రైతుల వద్దకే శాస్త్రవేత్తలు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు హుస్సేన్, పరుశురాం రైతుల ప్రశ్నలకు సమాధానాలిస్తూ, పంటలకు సేంద్రియ ఎరువులను వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి, ఎవో ఆసియా బేగం, ఏఈవో సంగీత కూడా పాల్గొన్నారు. రైతుల సమస్యలను శాస్త్రవేత్తలు నేరుగా తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడింది.

సంబంధిత పోస్ట్