కందిలోని ఐఐటీ హైదరాబాద్ కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో పీజీ కోర్సుల దరఖాస్తు గడువు ఏప్రిల్ 28తో ముగియనుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హెచ్ఐడి ప్రొఫెసర్ చంద్రశేఖర్ శర్మ సూచించారు. సిద్ధాంతాలతో పాటు అంతర్జాతీయ సవాళ్లకు పరిష్కారాలు చూపే వినూత్న పరిశోధనలకు తమ విభాగం ప్రాధాన్యతనిస్తుందని, ఆసక్తి గలవారు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.