కంది: 108 లో మహిళ ప్రసవం

కంది మండలంలో మంగళవారం ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. చర్లగూడెం గ్రామానికి చెందిన లక్ష్మీ అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గం మధ్యలోనే 108 వాహనంలోనే ఆమె ప్రసవించింది. అదృష్టవశాత్తూ, తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని 108 పైలెట్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్