కొండాపూర్ మండలం చెర్లోపాలెం సీసీ లక్ష్మి సంగారెడ్డికి బదిలీ అయ్యారు. సంగారెడ్డి మండలంలో పనిచేస్తున్న శివశంకర్ చర్ల గోపులారం బదిలీపై వెళ్లారు. బదిలీపై వెళ్తున్న సీసీ లక్ష్మిని మహిళా సంఘాల సభ్యులు ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వీవోవీ సంపూర్ణ, పుణ్యమ్మ, మంజుల, కవిత, కీర్తి గ్రామైక్య సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఈ బదిలీలు ఉద్యోగుల సర్దుబాట్లలో భాగంగా జరిగాయి.