కొండాపూర్: పాఠశాలను తనిఖీ చేసిన డీఈఓ

కొండాపూర్ మండలంలోని తమ్మలిబాయి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, కేజీబీవీ పాఠశాలలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల తరగతి గదులను, పరిసరాలను పరిశీలించారు. డీఈఓ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థుల నమోదును పెంచాలని, పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ దశరథ్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్