కొండాపూర్ మండలం మందాపూర్ గ్రామంలో పేదల భూములను పరిశ్రమల కోసం తీసుకోవద్దని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్యం మాట్లాడుతూ, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్వేనెంబర్ 22 లో 300 ఎకరాలు పేదల నుంచి పరిశ్రమలకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.