గిర్మాపూర్ లో బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, పరీక్షలను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం కూడా ముఖ్యమని ఆమె పేర్కొన్నారు.