సంగారెడ్డి వాసవి దేవాలయంలో కృత్తికా నక్షత్ర వేడుకలు

సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శనివారం కృత్తికా నక్షత్ర వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. దేవాలయ కమిటీ చైర్మన్ తోపాజి అనంత కిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమాలలో మహిళలు సామూహిక కుంకుమార్చన చేసి, లలిత సహస్ర పారాయణం చదివారు. వాసవి మాత పల్లకి సేవను కూడా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

సంబంధిత పోస్ట్