రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సదాశివపేట మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుందామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సదాశివపేట పట్టణంలోని ఫంక్షన్ హాల్ లో కృతజ్ఞత సమావేశం బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి నియోజకవర్గ నుంచి తనకు భారీ మెజార్టీ ఇచ్చినందుకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పాల్గొన్నారు.