హైదరాబాద్ లో గుండెపోటుతో మరణించిన సీనియర్ జర్నలిస్ట్, డిప్యూటీ సీఎం సిపిఆర్వో మారబోయిన మధుసూదన్ భౌతిక కాయానికి మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని వారి నివాసంలో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మధుసూదన్ కుటుంబ సభ్యులను ఓదార్చి, మనోధైర్యం చెప్పారు. సుదీర్ఘకాలంగా మధుసూదన్ తో ఉన్న అనుబంధాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు.