బీఆర్ఎస్ మహిళ ఎమ్మెల్యే లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అసెంబ్లీ కి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నల్ల బ్యాడ్జిలతో గురువారం హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ మహిళ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళ లోకాన్నే అవమానపరిచారని ఆరోపించారు.