సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేతుల మీదుగా ఓపెన్ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తెర్పోల్ గ్రామంలో ఆదివారం, ఎన్ఆర్జిఎస్ కింద రూ.8 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఓపెన్ డ్రైన్ నిర్మాణ పనులకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేకు గ్రామ సర్పంచ్ సతీష్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. అనంతరం, అనారోగ్యంతో ఉన్న నిరెడి బిక్షపతిని ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, మండల పార్టీ అధ్యక్షులు, ఉప సర్పంచ్, మాజీ ఎంపీటీసీలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్