ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా, సంగారెడ్డి జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని మహిళా ప్రాంగణంలో మాక్ పార్లమెంట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా, మంత్రులుగా వ్యవహరించారు. విద్యార్థులకు పార్లమెంట్ పై అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు డిఆర్డిఓ జ్యోతి తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి సత్తయ్య గౌడ్ కూడా పాల్గొన్నారు.