మొగుడం పల్లి: పిఆర్టియు మండల అధ్యక్షునిగా అర్జున్ చౌహన్

మొగుడం పల్లి పిఆర్టియు మండల అధ్యక్షునిగా అర్జున్ చౌహన్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు మాణయ్య , ప్రధాన కార్యదర్శి ప్రభు నియామక పత్రాన్ని శుక్రవారం రాత్రి అందించారు. అర్జున్ చౌహన్ మాట్లాడుతూ తనను మండల అధ్యక్షునిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘం బలోపేతానికి కృషి చేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు తులసీరామ్ రాథోడ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్