అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి అన్నారు. సంగారెడ్డి లోని ఇందిరా కాలనీ, రాజంపేట లలో అంగన్వాడీ కేంద్రాల వార్షికోత్సవ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఐదు సంవత్సరాల పిల్లలకు భోధన చేయాలని చెప్పారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.