నేషనల్ హెల్త్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి - యాదగిరి

నేషనల్ హెల్త్ ఉద్యోగుల సమస్యలు పరికరించాలని మెడికల్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం. యాదగిరి సంగారెడ్డిలో మంగళవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎం. యాదగిరి మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో గత 2 దశాబ్దాలుగా నేరేషనల్ హెల్త్ మిషన్ ద్వారా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 17456 మంది పని చేస్తున్నారని వారు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉందన్నారు. కాబట్టి వారి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న కార్మికులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్

✕
✕