జిల్లాలో అనుమతి లేకుండా పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా డీఈవో కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ శంకర్ కు వినతిపత్రం సమర్పించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాజేష్ మాట్లాడుతూ, అనుమతిలేని పాఠశాలలపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.