గ్రామపంచాయతీ కార్మికుల మూడు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని సుందరయ్య భవన్‌లో ఆదివారం ఆయన మాట్లాడుతూ, జోన్ 1న ఎంపీడీవో కార్యాలయాల వద్ద, 8వ తేదీన కలెక్టరేట్ ముందు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఆయన కోరారు.