పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రామగుండంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు కోసం చేస్తున్న కృషిని ముందుకు తీసుకెళ్లారు. గతంలో తిరస్కరించిన సైట్‌కు బదులుగా, కొత్త లొకేషన్‌పై ప్రీ-ఫీజిబిలిటీ స్టడీ కోసం చర్యలు తీసుకున్నారు. దీని కోసం రూ. 50 లక్షలు చెల్లించారు. డిసెంబర్ 3 లేదా 4 తేదీలలో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం రామగుండం ప్రాంతాన్ని సందర్శించి, కొత్త ల్యాండ్ సర్వే చేయనున్నట్లు ఎంపీ తెలిపారు. ప్రీ-ఫీజిబిలిటీ స్టడీ పూర్తయ్యాక భూసేకరణ, తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.