ఈఎంఆర్ ఐ గ్రీన్ హెల్త్ సర్వీస్ నందు ఉద్యోగుల నియామకాలు

ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థలో 108 అంబులెన్స్‌ సర్వీసుల్లో EMT, డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్ సెట్‌ను తీసుకుని సెప్టెంబర్ 4న జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలి. EMT పోస్టుకు నర్సింగ్, GNM, ANM, B.Pharm, D.Pharm, DMLT, MLT, B.Sc BZC అర్హతలు ఉండాలి. డ్రైవర్ పోస్టుకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు LMV డ్రైవింగ్ లైసెన్స్, మూడేళ్ల అనుభవం అవసరం. వివరాలకు 9110711270ను సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్