సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి ఆర్టీసీ డిపోలో TJMU (తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్) సంఘం విజయానికి కృషి చేయాలని నాయకులు, కార్మికులకు పిలుపునిస్తూ సమావేశం బుధవారం నిర్వహించారు. నిర్మలా జగ్గారెడ్డి పాల్గొని కార్మికుల సమస్యలు, సంఘం ఎన్నికలపై నాయకులతో చర్చించారు. ఈ సమావేశంలో TJMU రాష్ట్ర నాయకులు హనుమంతు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ కూన వనిత సంతోష్, వైస్ చైర్మన్ షఫీ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి డిపోలోని ఆర్టీసీ కార్మికులు, నాయకులు సమన్వయంతో పనిచేసి TJMU విజయం కోసం కృషి చేయాలని సూచించారు.