సంగారెడ్డి జిల్లాలో జనవరి 1 నుంచి 31 వరకు రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా హెవీ వెహికిల్స్, ఆటో డ్రైవర్లకు ఆరోగ్య, కంటి పరీక్షల నిర్వహణకు క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. అలాగే, పాఠశాలల మేనేజ్మెంట్ కు పాఠశాలల బస్సుల భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆమె చెప్పారు.