సంగారెడ్డి పట్టణంలోని రాజీవ్ పార్కు అభివృద్ధికి ప్రభుత్వం 12 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నిధులతో పార్కు సుందరీకరణ చేపడతామని పేర్కొన్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే ప్రతిపాదనలు తయారుచేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.