ఉమ్మడి జిల్లాలో డిసెంబర్ నెలలో రూ. 459.97 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందులో సంగారెడ్డి జిల్లా రూ. 224.06 కోట్లతో ప్రథమ స్థానంలో నిలిచింది. సిద్దిపేట జిల్లాలో రూ. 144.76 కోట్లు, మెదక్ జిల్లాలో రూ. 90.24 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. స్థానిక ఎన్నికలు, నూతన సంవత్సరం నేపథ్యంలో మద్యం అమ్మకాలు పెరిగాయని అధికారులు తెలిపారు.