సదాశివపేట: డిగ్రీ కళాశాలఆధ్వర్యంలో దివ్యాంగ దినోత్సవ వేడుకలు

సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో బుధవారం దివ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగ పాఠశాలలను సందర్శించి, విద్యార్థులను సన్మానించి, వారికి బహుమతులు పంపిణీ చేశారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ, దివ్యాంగుల జీవితాలలో ఆశ, ఆత్మవిశ్వాసం నింపడం మన సమాజ బాధ్యత అని, దివ్యాంగత్వం బలహీనత కాదని, విద్యార్థులలోని ప్రతిభను వెలికితీయడానికి ప్రేమ, ఆదరణ, ధైర్యం అవసరమని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్