విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కల్పిద్దామని సదాశివపేట మండల విద్యాధికారి శంకర్ అన్నారు. సదాశివపేట మండలం ఆత్మకూరు ఉన్నత పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలను గురువారం అందించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ తో పాటు మధ్యాహ్న భోజనం ఉచితంగా అందిస్తామని చెప్పారు.