సదాశివపేట పట్టణంలో ఆదివారం సూపర్ స్టార్ కృష్ణ జయంతిని ఘనంగా నిర్వహించారు. కృష్ణ అభిమాన సంఘం నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ, కృష్ణ ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారని గుర్తు చేసుకున్నారు.