సదాశివపేట: ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు. సదాశివపేటలో పార్టీ కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. అర్హులైన వారందరికీ రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కోరారు. సమావేశంలో మండల కార్యదర్శి ప్రవీణ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్