సదాశివపేట మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సదాశివపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీ అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని ఆమె స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ కూడా పాల్గొన్నారు.