సదాశివపేట: అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా పనిచేయాలి

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని టిపిసిసి ప్రధాన కార్యదర్శి, సదాశివపేట పట్టణ ఇన్చార్జి తోపాజి అనంత కిషన్ కార్యకర్తలకు సూచించారు. సదాశివపేటలో బుధవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మున్సిపాలిటీలో కౌన్సిలర్లు తమ వార్డులకే పరిమితమై పనిచేయాలని, ఇతర వార్డుల్లో జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్