సదాశివపేట: తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా

సదాశివపేట డిసిఎంఎస్ కేంద్రంలో జొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం వినతిపత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు జయరాజ్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రం లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రమేష్ గౌడ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్