సంగారెడ్డి జిల్లాలో గురువారం నిర్వహించిన పదో తరగతి భౌతిక, రసాయన శాస్త్రం పరీక్షకు 24,628 మంది విద్యార్థులకు గాను 24,588 మంది హాజరయ్యారు. ఇది 99.84 శాతం హాజరును నమోదు చేసింది. జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బీరంగూడ రామచంద్రపురం లోని మూడు పరీక్ష కేంద్రాలతో పాటు, మొత్తం 14 పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. పరీక్షలు సజావుగా జరిగినట్లు అధికారులు తెలిపారు.