సైబర్ నేరాలకు సంబంధించి జిల్లాలో నమోదైన 73 కేసులలో రూ. 1.32 కోట్లు, ఎఫ్ఐఆర్ లేకుండా 88 కేసులలో రూ. 10.83 లక్షల రూపాయలను సైబర్ బాధితులకు తిరిగి ఇప్పించేందుకు కోర్టు అనుమతి పొందినట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. లోక్-అదాలత్‌లో మొత్తం 4868 కేసులు పరిష్కరించబడ్డాయని ఆయన వెల్లడించారు.