వరకట్నం వేధింపుల కేసులో అదనపు డిస్ట్రిక్ట్ స్పెషల్ జడ్జి కృష్ణార్జున బుధవారం తీర్పు వెలువరించారు. బీహెచ్ఈఎల్ ఉద్యోగి ఉమారాణిని ఇంద్రకరణ్ కు చెందిన ప్రభుకు ఇచ్చి వివాహం చేయగా, అదనపు కట్నం కోసం ప్రభు వేధించడంతో మనస్థాపానికి గురైన ఉమారాణి 19.01.2016న అత్తగారింట్లో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ నేరం రుజువు కావడంతో నిందితుడు ప్రభుకు జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.