సంగారెడ్డి జిల్లాలో ఆభరణాల కోసం హత్య కేసులో నిందితుడు చంద్రయ్యకు జిల్లా జడ్జి భవాని చంద్ర జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. 19-11-2024న ఇర్గిపల్లి గ్రామానికి చెందిన కమలమ్మ పత్తి తీస్తుండగా, ఆమె భర్త లేని సమయంలో నిందితుడు చంద్రయ్య ఆమెను గొంతు నులిమి, రాయితో కొట్టి చంపి, చెవి కమ్మలు, కాళ్ళ కడియాలను దొంగలించాడు. నేరం రుజువు కావడంతో ఈ శిక్ష విధించారు.