సంగారెడ్డి ప్రభుత్వ అతిథి గృహంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులతో ఏఐఐసీ రాష్ట్ర ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలను సిద్ధం చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, టీజీఐసీసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు.