సంగారెడ్డి: '27న ఏఐటీయూసీ జిల్లా మహాసభ'

ఏఐటీయూసీ జిల్లా మహాసభ ఈనెల 27న సంగారెడ్డిలోని టీఎన్జీవో భవన్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి ప్రసాద్ తెలిపారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ అతిథి గృహంలో శనివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మహాసభలో కార్మికుల సమస్యలపై చర్చ జరుగుతుందని చెప్పారు. కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్