సంగారెడ్డి మండలం కల్పగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1989-90 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరుపుకున్నారు. వీరికి చెప్పిన గురువులు లింగా గౌడ్, కృష్ణయ్య, నాగేంద్రమ్మ, సావిత్రి విచ్చేసి, విద్యార్థులలో కలిసిపోయి అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఉన్నత స్థాయికి చేరుకున్న వారి శిష్యులను చూసి ఆనంద పడుతూ అందరిని దీవించినారు.