సంగారెడ్డి: అంబటి వ్యాఖ్యలు సరికాదు: టీడీపీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఇష్టానుసారంగా మాట్లాడిన వైసీపీ నేత అంబటి రాంబాబును వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మల్కాపూర్ లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అంబటి రాంబాబు భాష సరిగా లేదని, ఇలాంటి నాయకులను రాజకీయాల నుంచి బహిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్