విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం 'డా. బి. ఆర్. అంబేద్కర్ విదేశీ విద్యానిధి' పథకం ద్వారా రూ. 20 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోంది. అర్హులైన విద్యార్థులు మార్చి 31వ తేదీలోగా www.telanganaepass.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి సూచించారు. ఈ పథకం ద్వారా ఎంపికైన విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తుంది.