సంగారెడ్డి: జాతీయ చేనేత అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానం

జాతీయ చేనేత అవార్డు కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని చేనేత శాఖ సహాయ సంచాలకులు వెంకటరావు శుక్రవారం తెలిపారు. మార్చి 23వ తేదీ వరకు చేనేత కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు. దరఖాస్తుదారులు సమర్పించే డిజైన్లు గతంలో ఎవరూ తయారు చేసి ఉండకూడదని, మగ్గంపై తానే స్వయంగా తయారు చేసినట్లు ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్