సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం డిజిటల్ హెల్త్ ప్రొఫైల్స్ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. రాబోయే 3 నెలల్లో 4 లక్షల మంది ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేసి, కాగిత రహిత వైద్య సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రోగుల ఎత్తు, బరువు, వ్యాధులు, వాడే మందులు, టీకాల వంటి సమగ్ర సమాచారాన్ని 'ఈ-HIMS'లో నమోదు చేసి, 'ఈ-ఔషధి'తో అనుసంధానం చేస్తారు. ఈ కార్యక్రమం విజయవంతమైతే, రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.