సంగారెడ్డి: ఘనంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ

సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారులలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో శనివారం రాత్రి మహా పడిపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రదీప్ కుమార్ తండ్రి వైదిక పర్యవేక్షణలో, శబరిమలలో జరిగే తంత్ర పూజా విధానంలో ఈ పడిపూజను నిర్వహించారు. గురుస్వాములు ఆలపించిన పాటలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమం చివరిలో పడి వెలిగించి, అన్నసంతర్పణ కార్యక్రమాన్ని ఘనంగా జరిపించారు.

సంబంధిత పోస్ట్