సంగారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో, బీజేపీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ 34 వార్డులకు పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. మరో నాలుగు వార్డులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని ఆయన తెలిపారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని విజయ్ కుమార్ పిలుపునిచ్చారు.