సంగారెడ్డి: 4వ తేదీన విద్యాపీఠంలో రక్తదాన శిబిరం

సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఈనెల 4వ తేదీన ఉచిత రక్త, దంత, నేత్ర వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు. ఆశ్రమంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సేకరించిన రక్తాన్ని తలసేమియా బాధితులకు అందిస్తామని ఆయన చెప్పారు. ఈ శిబిరం ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్