సంగారెడ్డి: కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు

బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించినందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని పాత బస్టాండ్ వద్ద శుక్రవారం సంబరాలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులతో పాటు అనంత కిషన్, ఆంజనేయులు, కూన సంతోష్, మునిపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్