సంగారెడ్డి పట్టణంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలో ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో నిహారిక తెలిపారు. ఈ పోటీలలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ వంటి ఆటలను నిర్వహిస్తారు. అన్ని పాఠశాలల విద్యార్థులు సీఎం కప్ పోటీలలో పాల్గొనాలని ఆమె కోరారు.