సంగారెడ్డిలో బుధవారం మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ మున్సిపల్ సమన్వయకర్త రాజనర్సు, అవినీతి లేని పాలన బీఆర్ఎస్ తోనే సాధ్యమని అన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో మరోసారి బీఆర్ఎస్ జెండాను ఎగరవేద్దామని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కాంగ్రెస్ గ్యారంటీ కార్డు పేరుతో ప్రజల్లోకి వెళ్తామని ఆయన పేర్కొన్నారు.